కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. ఎన్నికలకు మరో ఎడాదిన్నర ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్… దాన్ని మాత్రం ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పార్టీలో నెలకొన్న అసమ్మతిని తగ్గించేందుకు ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ఇటీవల వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ…