దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ముందు వర్షాలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారింది. విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భక్తులు…