Hyderabad Rains : హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే కుండపోత వానలు మొదలయ్యాయి. పశ్చిమ, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం కుంభవృష్టిలా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మరో 3 గంటల పాటు ఈ కుండపోత వర్షం కొనసాగే అవకాశం…