రైళ్లల్లో ధూమపానం.. పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం నిషేధం. అంతేకాకుండా రైల్వేయాక్ట్ ప్రకారం చాలా తీవ్రమైన నేరం. అయినా కూడా కొందరు చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తూనే ఉంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రైల్లో జరిగింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనపై జరుగుతున్న విచారణకు సంబంధించి తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై RPF విచారణ అంటూ ఇవాళ తప్పుదారి పట్టించారని.. రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై నార్త్ రైల్వే ఇప్పటికే ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించింది.
వందే భారత్ రైలుకు సంబంధించిన వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైన్ పైకప్పు నుంచి వర్షపునీరు ధారలా కారిపోతుంది. దీంతో ప్రయాణికులు సీట్లో కూర్చోలేని దుస్థితి ఏర్పడింది. భారీగా నగదు చెల్లించి టికెట్ తీసుకుని.. సీట్లో కూర్చునే అవకాశం లేకుండా పోయింది.