రాష్ట్రంలో చేపట్టిన అన్ని రైల్వే ప్రాజెక్టులు నిర్దేశిత లక్ష్యంతో త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.72 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారని.. దానికి అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టి, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సీఎం అన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రైల్వే లైన్ల పనులు, భూసేకరణ, ఆర్థిక అవసరాలు వంటి అంశాలపై రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో…