పూరి జగన్నాథ్ తర్వాత ఆ రేంజులో కేవలం హీరో క్యారెక్టర్ పైన కథలు, వన్ లైనర్ డైలాగులు రాయగల సత్తా ఉన్న ఏకైక దర్శకుడు హరీష్ శంకర్. ఈ మాస్ డైరెక్టర్ తో మాస్ మహారాజా రవితేజ కలిసి ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి కొత్తగా ఈరోజు చెప్పాల్సిన అవసరమే లేదు. మిరపకాయ్ లాంటి ఘాటు సినిమాని ఇచ్చిన ఈ ఇద్దరు రైడ్ సినిమాని రీమేక్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ నటించిన…