Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో భాగంలో బెల్జియంలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు ఆయన యూరప్ లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యులను, ప్రవాసభారతీయులను, పలువురు వ్యాపారవేత్తలను ఆయన కలవనున్నారు. రాహుల్ గాంధీతో పాటు శ్యామ్ పెట్రోడా కూడా ఈ పర్యటనలో ఉన్నారు. యూరప్ చివర్లో ఆయన నార్వేలో పర్యటించనున్నారు. ఓస్టోలో అక్కడి పార్లమెంటేరియన్ సభ్యులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.