Rahul Gandhi: ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను చేపట్టారు. యాత్రలో భాగంగా 16వ రోజు పూర్జియా జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూర్ణియలోని రోడ్డు మధ్యలో రాహుల్ గాంధీని ఒక వ్యక్తి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు.