Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్‌లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు,…