(జూన్ 27న ఆర్.డి.బర్మన్ జయంతి)‘పిట్టకొంచెం కూత ఘనం’, ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’, ‘తండ్రికి తగ్గ తనయుడు’ – ఇలాంటి ఉపమానాలన్నిటికీ న్యాయంచేసిన ఘనుడు రాహుల్ దేవ్ బర్మన్. ఇలా పూర్తి పేరుతో చెబితే కొందరికి అర్థం కాకపోవచ్చు. ఆర్.డి.బర్మన్ అని చెప్పగానే సంగీతప్రియుల మది పులకించి పోతుంది. ప్రఖ్యాత సంగీత దర్శకులు సచిన్ దేవ్ బర్మన్ తనయుడే ఆర్డీ బర్మన్. తండ్రి వద్ద పనిచేస్తూనే, పలు చిత్రాలకు తనదైన బాణీలు కూర్చి అలరించారు ఆర్డీ. తరువాత సోలో…