Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్‌పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
PM Modi: పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. బికనీర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తా్న్‌పై మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్ని మోడీ హైలెట్ చేశారు. పాకిస్తాన్‌లోని రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతూ.. ఆ ఎయిర్‌బేస్ ‘‘ఐసీయూ’’లో ఉందని అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు,…