తాజాగా అక్షత తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు రోడ్లపై కనపడ్డారు. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తితో పాటు తన ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి సిటీలోని రాఘవేంద్ర మఠానికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఎలాంటి భద్రత లేకుండా సాధారణ పౌరుల్లా అక్కడ పరిసరాల్లో కలియతిరిగారు.