రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం…