RACHARIKAM Movie: గతంలో ఎన్నడూ చూడని కథతో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రాచరికం’ . ఈ సినిమాను ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని ఈ మూవీకి అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇదివరకే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి.…