భారత క్రికెట్ జట్టు ఆటగాడు, కర్నాటక ఫేసర్ ప్రసిధ్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలు రచనా కృష్ణను వివాహమాడారు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగగా.. బుధవారం సంప్రదాయ పంథాలో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.