ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈక్వెషన్స్ మారిపోయాయి. ఇంతకాలం అక్కినేని, మెగా ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అలానే అల్లు అరవింద్ సైతం అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ తో సినిమాలు నిర్మించి ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో భాగస్వాములు కావడం కూడా వారి బంధాన్ని బలోపేతం చేసింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్…