Raai Laxmi: రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిన్ను చూస్తే గల్ గల్ అన్నాయి నా చొక్కా బొత్తాలు.. అంటూ చిరంజీవి సరసన ఆడిపడిన లక్ష్మీరాయ్ గుర్తుందిగా.. కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది లక్ష్మీ రాయ్. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.