గత వారం విడుదలైన చిత్రాలలో 'విరూపాక్ష' బాక్సాఫీస్ బరిలో దుమ్ము రేపుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ మొత్తం నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
నందితా శ్వేత నాయికగా రూపుదిద్దుకున్న సింగిల్ క్యారెక్టర్ మూవీ 'రా... రా... పెనిమిటి'. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. సినిమా ఇదే నెల 28న జనం ముందుకు రాబోతోంది.
ప్రముఖ హీరోయిన్ నందితా శ్వేత చేసిన సింగిల్ క్యారెక్టర్ మూవీ 'రారా పెనిమిటి'. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ స్వరకల్పన చేయడం విశేషం.