R5 Zone Layouts: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50…