ఏపీలో థియేటర్లు మూసివేస్తుండటంపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల మూతపడ్డ అన్ని సినిమా థియేటర్లు తెరుచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయడం బాధాకరమన్నారు. సినిమా థియేటర్లు మూసివేయవద్దని యజమానులు, నిర్మాతలను ఆయన కోరారు. Read…
తెలుగు సినిమా రంగంలో నటుడు ఆర్.నారాయణమూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జన్మించింది ఏపీలోనే అయినా తెలంగాణ జీవన విధానంలోనే ఎక్కువగా ఆయన గడిపారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో జన్మించిన ఆర్.నారాయణమూర్తి ఎక్కువగా గ్రామీణుల నేపథ్యంలోనే అనేక సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే ఆయన విప్లవాత్మక సినిమాలు తీయడంలో దిట్ట. ఎక్కువగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న నారాయణమూర్తి సోమవారం నాడు పరకాల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో బస్సులోని కండక్టర్…