కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇటీవల ఆయన 100వ సినిమాని సైలెంట్‌గా ప్రారంభించారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో ఎలాంటి కథతో, ఎలాంటి రోల్‌లో కనిపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేయగా. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.…
‘నిన్నిలా… నిన్నిలా’ చిత్రంలో జంటగా నటించిన అశోక్ సెల్వన్, రీతువర్మ మరోసారి జోడీ కడుతున్నారు. నిత్యామీనన్ కీలక పాత్ర పోషించిన ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంది. తెలుగు వర్షన్ ను బీవీఎస్ఎన్ ప్రసాద్… ఓటీటీ ద్వారా ఆ మధ్య విడుదల చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే… అశోక్ సెల్వన్, రీతువర్మతో వైకామ్ 18 స్టూడియోస్, రైజ్ ఈస్ట్ స్టూడియోస్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీతో ఆర్. కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.…