టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చిన యాష్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. సిరీస్ మధ్యలోనే అశ్విన్ సడన్‌గా రిటైర్మెంట్ ఇవ్వడంతో భారత అభిమానులతో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. తాజాగా అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.…