India successfully test-fires Quick Reaction Surface to Air Missile system: భారత అమ్ములపొదిలో కొత్తకొత్త ఆయుధాలు, క్షిపణులు, క్షిపణి నిరోధక వ్యవస్థలు చేరుతున్నాయి. పూర్తిగా మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద పలు అత్యాధునిక ఆయుధాలను రూపొందిస్తోంది ఇండియా. తాజాగా క్విక్ రియాక్షన్ సర్ఫెస్ టూ ఎయిర్ మిస్సైల్(క్యూఆర్ఎస్ఏఎం) వ్యవస్థ పరీక్ష విజయవంతం అయింది. ఈ విషయాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) గురువారం వెల్లడించింది.