India successfully test-fires Quick Reaction Surface to Air Missile system: భారత అమ్ములపొదిలో కొత్తకొత్త ఆయుధాలు, క్షిపణులు, క్షిపణి నిరోధక వ్యవస్థలు చేరుతున్నాయి. పూర్తిగా మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద పలు అత్యాధునిక ఆయుధాలను రూపొందిస్తోంది ఇండియా. తాజాగా క్విక్ రియాక్షన్ సర్ఫెస్ టూ ఎయిర్ మిస్సైల్(క్యూఆర్ఎస్ఏఎం) వ్యవస్థ పరీక్ష విజయవంతం అయింది. ఈ విషయాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) గురువారం వెల్లడించింది. గగనతలంలో ఉన్న డమ్మీ శతృ వస్తువును అత్యంత కచ్చితత్వంతో గాలిలో ఉండగానే కూల్చింది.
ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్డీవో, భారత సైన్యం సంయుక్తంగా క్యూఆర్ఎస్ఏఎం పరీక్షను చేపట్టాయి. క్యూఆర్ఎస్ఏఎం క్షిపణినికి సంబంధించి ఆరు కీలక టెస్టులు నిర్వహించింది డీఆర్డీవో. దీర్ఘ శ్రేణి మీడియం ఎత్తు, తక్కువ శ్రేణి హై అల్టిట్యూడ్, శతృ దేశాల వస్తువులను గగనతలంలో గుర్తించడం వంటి సామర్థ్యాలను అంచనా వేయడానికి వివిధ టెస్టులను నిర్వహించారు. పగలు, రాత్రి వేళల్లో క్యూఆర్ఎస్ఏఎమ్ పనితీరును పరీక్షించారు. అన్ని పరీక్షల్లో ఈ క్షిపణి విజయవంతం అయినట్లు సైన్యం, డీఆర్డీవో ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించి ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో గాలిలో ఉన్న మరో వస్తువును నేల కూల్చింది.
Read Also: Red Sandal Gang Arrest: రెచ్చిపోతున్నఎర్రచందనం స్మగ్లర్లకు చెక్
క్యూఆర్ఎస్ఏఎం పనితీరును టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డాటాను సేకరించారు. సీనియర్ డీఆర్డీవో, ఆర్మీ అధికారుల సమక్షంలో టెస్టులు జరిగాయి. స్వదేశీ ఆర్ఎఫ్ సీకర్, మొబైల్ లాంచర్, ఆటోమేటెడ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్స్, నిఘా, మల్లీ పంక్షన్ రాడార్లు ఈ క్యూఆర్ఎస్ఏఎమ్ సిస్టమ్ లో ఉన్నాయి. గగనతల రక్షణ వ్యవస్థలో క్యూఆర్ఎస్ఏఎం కీలకంగా మారనుంది. శత్రుదేశాల విమానాలు, డోన్లను గుర్తించి కూల్చివేయడంలో క్యూఆర్ఎస్ఏఎం కీలకం కానుంది.
India successfully test-fires Quick Reaction Surface to Air Missile system
Read @ANI Story | https://t.co/xeQWmFuUZX#DRDO #QRSAMsystem #IndianArmy #QRSAMweaponsystem pic.twitter.com/2s5COKu7TK
— ANI Digital (@ani_digital) September 8, 2022