కామన్‌వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించింది.కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.