ఇన్నాళ్లూ రాకెట్ పట్టి మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత స్టార్ పీవీ సింధు.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో ఆదివారం రాత్రి 11.20కి మూడుముళ్ల బంధంతో సింధు, సాయి ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు ప్రముఖులు, ఫాన్స్, నెటిజన్లు…
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి సందడి మొదలైంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహాం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరగనుంది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని రఫల్స్ హోటల్లో సంప్రదాయ రీతిలో పెళ్లి జరగబోతోంది. పెళ్లికి 140 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. అతిథుల కోసం హోటల్లో 100 గదులు బుక్ చేసినట్లు సమాచారం. సింధు తన వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను…
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. తనకు కాబోయే భర్తతో ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూ వరులు పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. అలాగే ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. కాగా.. ఆ ఫోటోలను పీవీ సింధు ఈరోజు (శనివారం) సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
రెండు ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్ పీవీ సింధు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. డిసెంబర్ 22న సింధు, సాయిల పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుంది. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. డిసెంబర్ 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు ఆరంభం కానున్నాయి. పీవీ సింధు తండ్రి పీవీ రమణ…