నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంతమందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని ఓడించే అవసరం మాకు లేదని.. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నే శత్రువంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచల వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ని ఓడించే కార్యాచరణ తీసుకోవడం మాకేం అవసరం లేదన్నారు. మాకు మేమె శత్రువులమని వైస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్‌ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో తన కళ్ళకు పరీక్ష చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు.