తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ప్రజలతో మమేకం కావాలని ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ వర్గాలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం లో ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధి కనిపిస్తోంది… ఆ అభివృద్ధి వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోదన్నారు. 2018లో నన్ను ఓడించడానికి చాలా ప్రయత్నలు జరిగాయని, జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సహించలేని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు.
Also Read : Health Director Srinivas : అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అదే విధంగా నా సేవలు..
కొందరు వ్యక్తులు గ్లోబల్స్ ప్రచారం చేస్తారు…. వాటిని తిప్పికొటే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వేషాలు వేసుకొని వస్తారు…కేవలం ఎన్నికల అప్పుడే వస్తారు…. ఎన్నికల తర్వాత కనిపించారని ఆయన అన్నారు. మేము అలా కాదు ఇక్కడే పుట్టాం, ఇక్కడే పోతామని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం చరిత్రలో మనం చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు…. మనం చేసిన అభివృద్ధి సువర్ణాఅక్షరాలతో లీఖించవచ్చని, పార్టీని కాదు అని నేను ఒక్క అడుగు కూడా ముందుకు పోనని పువ్వాడ అజయ్ అన్నారు.
Also Read : Nikhat Zareen: చరిత్ర సృష్టించిన జరీన్.. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం