చాలారోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీకి రవాణా మంత్రి.. సంస్థకు ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ వచ్చారు. ఈ మార్పు రుచించలేదో ఏమో.. ఆర్టీసీవైపు కన్నెత్తి చూడటం లేదు మంత్రి. సంస్థ ఛైర్మన్‌ను కలిస్తే ఒట్టు. కలిసి సమీక్షల్లేవ్. ఎందుకిలా? మంత్రికి ఉన్న అభ్యంతరాలేంటి? ఆర్టీసీ వ్యవహారాలపై మంత్రి టచ్ మీ నాట్..! పువ్వాడ అజేయ్ కుమార్… తెలంగాణ రవాణా మంత్రి. బాజిరెడ్డి గోవర్దన్… తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్టీసీలో వ్యవహారాలను అన్నీ తానై చూసిన…
మంత్రి అంటే.. ఆయన శాఖకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉంటుందని అనుకుంటాం. బాధ్యతలు చేపట్టిన కొత్తలో తెలియకపోయినా.. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కొందరు. మరి.. ఆ ప్రయత్నం చేయలేదో ఏమో.. సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నకు గుడ్లు తేలేశారట మంత్రి పువ్వాడ అజయ్. ఆ సందర్భంగా పేలిన డైలాగులపైనే ఇప్పుడు చర్చ. ఆర్టీసీ బస్సుల లెక్కలు అడిగితే బిక్కముఖం వేసిన మంత్రి అజయ్? టీఆర్‌ఎస్ ప్లీనరీ.. తెలంగాణ విజయ గర్జన సభపై మాట్లాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో…