భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొగడ్తలతో ముంచెత్తారు. పుతిన్ గురువారం మాస్కోకు చెందిన థింక్ ట్యాంక్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌లో తన వార్షిక ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు.