పుష్ప సినిమా టాలీవుడ్‌నే కాదు.. పాన్ ఇండియా లేవల్లో ఓ ఊపు ఊపింది.. అయితే, ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దర్శకుడు ఉపయోగించిన ట్రిక్కులను.. చాలా సందర్భాల్లో దొంగలు ఉపయోగించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, కాకినాడ జిల్లా జగ్గంపేటలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జగ్గంపేట, కిర్లంపూడి పోలీసులు టోల్‌గేట్ వద్ద అదుపులోనికి తీసుకున్నారు.
ఎర్రచందనం అక్రమార్కులకు బంగారంగా మారింది. ఏపీతో సహా కర్నాటక, తమిళనాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా సాగిపోతోంది. చెన్నైలో భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రెడ్ హిల్స్ లోని ఓ పాత సామాన్లు గోడౌన్ లో దాచిపెట్టిన సుమారు రెండు కోట్లు విలువచేసే 179 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుంది రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోంది.…