Pushpa 2 Japan Release: జపాన్ రాజధాని టోక్యో నగరంలో నిర్వహించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించాడు. ఈ కార్యక్రమంలో బన్నీ జపనీస్ లాంగ్వేజ్ లో ‘పుష్ప’ డైలాగ్ చెప్పగానే థియేటర్ మొత్తం ఒక్కసారిగా హర్షధ్వానాలు, చప్పట్లతో మారుమోగింది.