Hyderabad: బాలానగర్ విమల్ థియేటర్లో పుష్ప 2 టికెట్ల రగడ కొనసాగుతోంది. పుష్ప 2 రిలీజ్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా విమల్ థియేటర్లో పుష్ప 2 సినిమా వేశారు. ఈ నేపథ్యంలో పలువురు అభిమానులకు టికెట్స్ అందలేదు దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. టికెట్స్ లేకపోవడంతో ఆగ్రహంతో రెండు వర్గాలకు చెందిన ఫ్యాన్స్ పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.