రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు సచివాలయంలో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఉద్దశ్యపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి, బస్తీలకు తక్కువ నీరు విడుదల చేసే సిబ్బంది పై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.