తమ అభిమాన నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం తట్టుకోలేని అభిమానులు అనూహ్య ఘటనలకు పాల్పడుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని పలువురు అభిమానులు గుండెపోటుకు గురికాగా మరికొందరు అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణ వార్త విన్న వెంటనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు రాయచూర్ జిల్లాలో కూడా ఇద్దరు పునీత్ అభిమానులు బసవ గౌడ్, మహ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి…