శుక్రవారం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా, ఈ విమానం తిరుగు ప్రయాణాన్ని ఎయిర్‌లైన్ రద్దు చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో పక్షి విమానాన్ని ఢీకొట్టిన విషయం పైలట్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే, పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో సంస్థ విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది.…
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకనాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పూణె విమానాశ్రయం పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పూణె విమానాశ్రయం పేరు మార్చారు. 'జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం'గా నిర్ణయించారు.
పూణె ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో సిద్ధమై.. టేకాఫ్ అవుతుండగా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమాన మధ్య భాగం భారీగా దెబ్బతింది. పైలట్ల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముక్కు, ల్యాండింగ్ గేర్ దగ్గర టైర్ దెబ్బతిన్నట్లు విమానాశ్రయ అధికారి వెల్లడించారు. పూణె నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 180 మంది ప్రయాణికులతో ఎయిరిండియా…
బంగారం, మత్తు పదార్థలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీగా వీటిని పట్టుకుంటున్నా కూడా ముఠాలు ఆగడాలు తగ్గడం లేదు.. తాజాగా మరో ఆపరేషన్ లో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) యొక్క పూణే ప్రాంతీయ యూనిట్ బుధవారం పూణేలో ఒక మహిళా ప్రయాణీకురాలు ధరించే బెల్ట్‌లో బంగారు పేస్ట్ రూపంలో దాచిన రూ. 3.66 కోట్ల…