ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే…
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమ్మె నోటీసుపై స్పందిస్తూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెపై పునరాలోచించాలని కోరారు. ఈ సమయంలో ఆర్టీసీ సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి పూర్తిగా సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పోరాటం ఎంతో కీలకంగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ…
KSRTC Conductor: భారతదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్రయాణాలలో ఇలా అనేకచోట్ల జరుగుతున్న సంఘటనలు మహిళల పట్ల దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. మంగళూరు నగరానికి ముడిపు నుంచి వస్తున్న బస్సులో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బస్సు కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని ప్రదీప్ కశప్ప నాయక్‌గా గుర్తించారు. ప్రయాణిస్తున్న మహిళ…
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో నిందితుడు ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమరాల్లో నిందితుడు కనిపించలేదు.
హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై తన దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా ఎల్‌అండ్‌టీ, సంబంధిత యాడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. "కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం నా దృష్టికి వచ్చింది. ఈ ప్రకటనలను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించాను. ఈ రాత్రికే పూర్తిగా అటువంటి…
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి మౌలిక స్వేచ్ఛను పెంచడం దీని లక్ష్యం. మార్చి 8న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో తన ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ…
TGSRTC: హైదరాబాద్ – విజయవాడ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తోంది ఆర్టిసి. విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు టీజిఎస్‌ఆర్టీసీ నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీని అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. TGSRTC ఈ అవకాశాన్ని…
VC Sajjanar : తమ క్షేత్రస్థాయి ఉద్యోగులు, అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ వర్చ్ వల్ సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ బస్ భవన్ నుంచి శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఈ సమావేశాలు జరిగాయి. సంస్థ పనితీరు, సంక్రాంతి ఆపరేషన్స్, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత రవాణా సౌకర్య పథక అమలు, తదితర అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశాల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్…
మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడి బుధవారం జరిగిన కీలక సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం ఈరోజు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది.