హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఆరు దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు "సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్"ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు.
గ్రేటర్ వాసులకు ఏ సమస్యనైనా అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్ పేరే మై జీహెచ్ఎంసీ. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రహదారులపై గుంతలు, చెత్త, మురుగు నీటి వ్యవస్థ బాగోలేకపోయినా... ఇలా ఏ సమస్య అయినా ఒక ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు... ఏ ప్రాంతం నుంచి ఫోటో అప్ లోడ్ అయితే ఆ ప్రాంత అధికారులకు…
తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా,…
Minister Seethakka: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి…
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు.
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. అయితే.. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి సమావేశంలో మంత్రులు, సెక్రటరీలు, హెచ్వోడీలు పాల్గొంటారు.
కంటోన్మెంట్ బంజారానగర్ లో జరిగిన సీనియర్ సిటిజన్స్, బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అన్యాయంకి, దుర్మార్గంకి వ్యతిరేకంగా కొట్లాడడమే నా వ్యక్తిత్వమన్నారు.