బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగించింది. ఈ బంగారం 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదంతా నిరుపయోగంగా ఉందని..ఈ వెయ్యి కిలోల బంగారాన్ని కరిగించి 24 క్యారట్ల కడ్డీలుగా మార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్వర్ణాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ.17.81 కోట్లు వడ్డీ వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ సోమవారం సమన్లు పంపింది.