జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్‌లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్‌లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను…
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెండవ రోజు ఇంటింటి సర్వే కొనసాగనుంది. వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
Damodara Rajanarasimha : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంది. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పులపాలు కాకుండా, అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలి. ఆ భరోసాను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద…
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ, కల్తీ వ్యాపారాలు సాగుతున్నాయి. పోలీసులు,అధికారులు పట్టించుకోక పోవడంతో కల్తీ రాయుల్ల వ్యాపారాలు మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. చాదర్ ఘాట్ పరిధిలోని రసూల్ పురా , వినాయక వీధి ప్రాంత స్థానికుల ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలేటి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంత నివాసాల్లో దాడులు నిర్వహించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తయారీని గుర్తించి…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో పర్యటించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన ఊబకాయం సమస్యను ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు.
Arabian Mandi : హైదరాబాద్ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, ఐటీ హబ్‌గా, వాణిజ్య కేంద్రంగా మారుతోంది. ఈ అభివృద్ధికి అనుగుణంగా రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నగరవాసుల జీవన శైలిలో మార్పుల కారణంగా రెస్టారెంట్లపై ఆదరణ పెరిగినా, అందులో అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు హోటళ్లలో ఆహార నాణ్యత మాంద్యం చెందడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం సిద్ధం కావడం తీవ్ర సమస్యగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం…
GBS Virus : మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) విజృంభణ నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207 కు పెరిగింది. ఫిబ్రవరి 14న మరో ఇద్దరు అనుమానిత రోగులు కనుగొనబడ్డారు.
Damodara Raja Narasimha: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక…
Drugs Mafia: ప్రపంచంలోని ప్రతి దేశంలో డ్రగ్స్ వాడకం ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది. ఇక అత్యంత ఎక్కువ జనాభ ఉన్న దేశాలలో భారత్ ఒకటి. దింతో భారత్ లో ప్రమాదకరమైన డ్రగ్స్ ను అమ్మెందుకు డ్రగ్స్ డీలర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ ను nనివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇకపోతే తాజాగా అండమాన్ నికోబార్ రాజధాని శ్రీ విజయపురంలో పోలీసులు రూ.36 వేల కోట్ల…
HMPV Virus: ఐదేళ్ల క్రితం చైనాలో కరోనా వైరస్ అనే వ్యాధి వ్యాప్తి చెంది ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ వైరస్ యొక్క చాలా లక్షణాలు కరోనాను పోలి ఉంటాయి. వైరస్ పేరు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (Human metapneumovirus) అయినప్పటికీ, దీని బారిన పడిన వారిలో దగ్గు, జలుబు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో మరోసారి ఆందోళన…