చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ, కల్తీ వ్యాపారాలు సాగుతున్నాయి. పోలీసులు,అధికారులు పట్టించుకోక పోవడంతో కల్తీ రాయుల్ల వ్యాపారాలు మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. చాదర్ ఘాట్ పరిధిలోని రసూల్ పురా , వినాయక వీధి ప్రాంత స్థానికుల ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలేటి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంత నివాసాల్లో దాడులు నిర్వహించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తయారీని గుర్తించి ఆ మొత్తాన్ని మూసీ లో పడబోశారు. మురుగువాసనతో కుళ్లిపోయిన వెల్లుల్లి,అల్లం దర్శనమిచ్చాయి. వీటిని పేస్ట్ గా మార్చి అందులో ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి మార్కెట్లోకి సప్లై చేస్తున్నట్లు సమాచారం. ఈ తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు, ఫుడ్ సేఫ్టీ పర్మిషన్లు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి రుచి, వాసనకు మంచిగా అనిపించినా కడుపులోకి వెళ్తే మాత్రం విషంతో సమానం అంటున్నారు అధికారులు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ వ్యాపారులపై పోలీసులు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కల్తీ వ్యాపారం నిర్వాహకులపై టాస్క్ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు.. టీ20 కెరీర్‌లో అరుదైన ఘనత..