తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
విశాఖపట్నంలో గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్ గజపతి రాజుకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాను.విశాఖ లో ప్రజా ధనం తో కట్టిన ఋషి కొండ ప్యాలస్ పెచ్చులు ఉడిపోయాయి అని తెలిసింది.ఆ భవనం కోసం ఖర్చు పెట్టిన 600- 700 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అయ్యేది అనుకునే వాడిని….ఈ ప్యాలస్ ఏం చెయ్యాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది…దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే…