నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామని చెప్పారు. 2029 నాటికి రూ. 5 లక్షల వర్క్ స్టేషన్లు పెట్టనున్నట్లు తెలిపారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మాణం, యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీల పైనే ఉందని తెలిపారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల సంక్షేమం కోసం, జవాబుదారితనంతో పనిచేస్తుందన్నారు. వ్యక్తుల కోసం కాదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా.. సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ & గృహ నిర్మాణ సంస్థ ఎండీ విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.