మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు దేశం లోపల, బయట రచ్చకు కారణం అయ్యాయి. పలు ఇస్లామిక్ దేశాలు భారత్ కు తన నిరసన వ్యక్తం చేశాయి. అయితే భారత్ కూడా ఇదే స్థాయిలో వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు…