నాగ్ అశ్విన్… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, రెండో సినిమా మహానటితో ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ తన వైపు చూసేలా చేశాడు. మహానటి సావిత్రి కథతో కీర్తి సురేష్ ని పెట్టి మహానటి సినిమా చేసిన నాగ్ అశ్విన్ సౌత్ ఇండియా హిట్ కొట్టాడు. ఈసారి అంతకు మించి అన్నట్లు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా…
బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తే ‘ప్రాజెక్ట్ K’ సినిమాతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ ని చెయ్యాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. హ్యుజ్ స్కేల్ లో, ఇండియాలోనే భారి బడ్జట్ తో, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ సినిమాపై ఇండియాలో భారి అంచనాలు ఉన్నాయి. అసలు నాగ్ అశ్విన్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు? ప్రాజెక్ట్ K అంటే ఏంటి?…