బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో మద్యం సీసాలను ఇంట్లో దాచిపెట్టినట్లు అనుమానం రావడంతో పోలీసులు ఓ నవ వధువు అత్తారింటి వద్ద హల్చల్ చేశారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపించకుండా పెళ్లి కూతురు బెడ్ రూమ్ కి వెళ్లి మద్యం సీసాలకోసం వెతికారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాలలోకి వెళితే.. హజీపూర్ నగరంలోని హత్సార్‌గంజ్ ప్రాంతంలో నివసించే షీలాదేవి కొడుకుకు ఇటీవలే పూజా కుమారితో…