మావోయిస్టుల లింకు కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017 సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్‌పై కోర్టు తీర్పు వెలువడింది.