తెలుగులో ఎన్నో మంచి సినిమాలని నిర్మించిన ‘స్రవంతి’ రవికిశోర్ ప్రొడక్షన్ హౌజ్ లో తెరకెక్కిన మొదటి తమిళ సినిమా ‘కిడ’. గోవాలో జరిగిన ఇఫీ (ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లోని పనోరమాలో ప్రదర్శించిన ఈ చిత్రం ఖాతాలో ఇప్పుడు రెండు ప్రెస్టీజియస్ అవార్డులు చేరాయి. తాజాగా 20వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం మరియు ‘ఉత్గాతమ నటుడు’ కేటగిరిల్లో అవార్డులు అందుకుంది. ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు ఆర్ఏ వెంకట్ కు అవార్డుతో పాటు…
నేడు సినిమా అంటే కళాసేవ కంటే కాసులపై ధ్యాసనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందరో అభిరుచిగల నిర్మాతలు మారుతున్న కాలంతో పాటు విలువలు కనుమరుగై పోవడంతో చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ అభిరుచితో చిత్రాలను నిర్మిస్తున్న అరుదైన నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన బ్యానర్ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. నవతరం ప్రేక్షకులకు మాత్రం స్టార్ హీరో రామ్ పోతినేని పెదనాన్నగా గుర్తుంటారు. ఏది ఏమైనా ‘స్రవంతి’ రవికిశోర్ ఈ నాటికీ తన అభిరుచికి…
(జూలై 11న రవికిశోర్ పుట్టినరోజు) బ్యానర్ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మూడున్నర దశాబ్దాలుగా చిత్రాలను నిర్మిస్తున్నారు రవికిశోర్. తన మనసుకు నచ్చిన కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ, మెచ్చిన పరభాషా చిత్రాన్ని తెలుగులోకి అనువదించడంలోనూ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. విలక్షణ దర్శకుడు వంశీతో రవికిశోర్ చిత్రప్రయాణం ఆరంభించారు. వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ నిర్మించి, ఆ సినిమాతోనే తన అభిరుచి ఏమిటో చాటుకున్నారు.…