వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసాడని కిరణ్ పై అయన బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ ను అరెస్ట్ చేసారు. ఆ వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు దాసరి కిరణ్. అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు చేసారు పోలీసులు. Also Read…
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దాసరి కిరణ్.