ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో…
తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర నీరజ్ చోప్రాను బాహుబలి అంటూ ప్రశంసించారు. ఈ క్రమంలో ఓ ట్విటర్ యూజర్ నీరజ్ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీ 700ని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. రితేష్ అభ్యర్థనను అంగీకరించిన ఆనంద్ మహీంద్ర.. ”తప్పకుండా ఇస్తానని ప్రకటించాడు. స్వర్ణం సాధించిన మా అథ్లెట్‌కు ఎక్స్‌యూవీ…